రైతులకు అలర్ట్..తెలంగాణ సీఎస్ కీలక ప్రకటన

Alert for farmers..Telangana CS key announcement

0
90

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. యాసంగిలో వరి సాగు చేయొద్దని.. పారాబాయిల్డ్ బియ్యం తీసుకోవద్దని కేంద్రం ప్రభుత్వం, ఎఫ్‌సీఐ నిర్ణయించాయని పేర్కొన్నారు.

తెలంగాణ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ అధికారుల‌తో సీఎం సోమేశ్ కుమార్ స‌మీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, తదితర అంశాల‌పై అధికారులతో స‌మీక్షించారు. ఈ స‌మావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ..పారాబాయిల్డ్ బియ్యం తీసుకోవ‌ద్దని కేంద్రం, ఎఫ్‌సీఐ నిర్ణయించాయని పేర్కొన్నారు. కావున రైతులు యాసంగిలో వ‌రి సాగు చేయొద్దంటూ సూచించారు.

విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలున్న రైతులు వ‌రిసాగు చేయొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం 40 లక్షల మెట్రిక్ ట‌న్నుల బియ్యం మాత్రమే కొంటామ‌ని కేంద్రం చెప్పిందని.. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జ‌రిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే.. అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.