తెలంగాణ ఇంట‌ర్ విద్యార్థుల‌కు అల‌ర్ట్‌..పరీక్షలపై సర్కార్ కీలక నిర్ణయం

Alert for Telangana Inter students..Government key decision on exams

0
90

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రధాన, సమాధానాలు అలాగే ప్రాక్టికల్ తరగతులు బోర్డు వచ్చే వారం నుంచి టీ షర్ట్ అలాగే దూరదర్శన్ లో ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసింది. ఇక ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే మాసం 5వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలోనే ఈ సారి ఇంటర్ పరీక్షలు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి.

అయితే గత సంవత్సరం ప్రిపరేషన్ కోసం స్టడీమెటీరియల్స్ ఇచ్చినా… 51 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమైన ప్రశ్నలు అలాగే సమాధానాలు రూపొందించి విద్యార్థులకు టీవీల ద్వారా ప్రశ్నలు అలాగే సమాధానాలు ఇతర ప్రాక్టికల్ తరగతులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.