జనసేన లో కి టాలీవుడ్ టాప్ కమెడియన్

జనసేన లో కి టాలీవుడ్ టాప్ కమెడియన్

0
147

జనసేనలోకి టాలీవుడ్‌ టాప్‌ కమెడియన ఆలీ జాయిన్‌ అవడానికి రెడీ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.. గత ఎన్నికల సమయంలోనే ఆలీ టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారని, రాజమండ్రి నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారనే ప్రచారం జరిగింది.. లాస్ట్‌ మినిట్‌లో ఏం జరిగిందో ఏమో ఆయన పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు.

ఈసారి ఆలీ జనసేన తరఫున పోటీ చేయనున్నారనే ప్రచారం ఊపందుకుంది.. తూర్పు గోదావరి జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి రేస్‌లో నిలవాలని భావిస్తున్నాడట ఆలీ. గోదావరిలో అయితే పవన్‌ సామాజిక వర్గంతోపాటు తన ఇమేజ్‌ కొంతవరకు కలిసి వస్తుందని ఆలీ అంచనా వేస్తున్నాడట.. సామాజిక కార్యకలాపాలలోనూ చురుకుగా పాలు పంచుకుంటాడు.. ఇది కూడా అడ్వాంటేజ్ అవుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు..