కమెడియన్ అలీ రాజకీయ రంగప్రవేశం రీ ఎంట్రీ పై పలు వార్తలు ఇప్పటి వరకూ చక్కర్లు కొట్టాయి.. ఇక 11 ఏప్రిల్ ఏపీలో ఎన్నికలు అంటే సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది ..ఇక ఎన్నికల పోరుకి కేవలం 15 రోజులు మాత్రమే సమయం ఇక రాజకీయ నాయకులు పరుగులుపెట్టే సమయం.. ప్రచారాలలో క్యాంపెయినింగ్ స్టార్లుగా మారిపోవాలి, అలాగే అభ్యర్దులని ఫైనల్ చేయడం మేనిఫెస్టో ప్రకటన చేయడం ఇటు తెలుగుదేశం వైసీపీ జనసేన అధినేతల పని. ఇక ఇప్పుడు కమెడియన్ అలీ పొలిటికల్ ఎంట్రీ ఏ రాజకీయ పార్టీలో అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఆయన కోరిక ఏ పార్టీ నెరవేరుస్తుంది అంటే పెద్ద డౌట్ గా మారింది.
మొత్తానికి నేటి వార్తల ప్రకారం (11-03-2019)న అలీ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి ఆయన లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. సోమవారం కాకినాడలో వైసీపీ సమర శంఖారావం సభ ఉండటంతో ఉదయమే అలీ పార్టీలో చేరారు. ఇక జగన్ కాకినాడ బయల్దేరి వెళుతున్నారు….అయితే అలీ చేరికతో ఆయన ఎక్కడపోటీ చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారిందది. గతంలో ఆయన మూడు పార్టీల అధినేతలకు కలిశారు, కాని ఆయన ఏ పార్టీలో చేరతారు అనేది సస్పెన్స్ గా ఉంచారు..అలీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు కోసం దరఖాస్తు చేయడంతో అక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. ఇక అక్కడ ఆయనకు సీటు ఇచ్చే ఆస్కారం ఉంది అని తెలుస్తోంది వైసీపీ తరపున.