అలీకి సీఎం జగన్ బంపర్ ఆఫర్…

అలీకి సీఎం జగన్ బంపర్ ఆఫర్...

0
93

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హాస్యనటుడు అలీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… త్వరలోనే ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి…

నాలుగు రాజ్యసభ స్థానాలు అధికార వైసీపీకే దక్కనున్నాయి దీంతో ఈ నాలుగు స్థానాలకు ప్రధానంగా పది మంది పేర్లు చర్చకు వస్తున్నాయి.. వీరిలో అధికార పార్టీ తరపున ఎవరు పార్లమెంటు గడప తొక్కనున్నారనేది ఆసక్తికర చర్చ…

మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మోపిదేవి, పిల్లి శుభాష్ లతో పాటు పలువురి పేర్లు ప్రాధానంగా వినిపిస్తున్నారు… అయితే వీరితో పాటు తాజాగా మరోపేరు వినిపిస్తోంది…

మైనార్టీ కోటాలో ఒకరిని రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నాయి…. మైనార్టీ కోటా కింద ముందువరుసలో అలీ ఉన్నారని వార్తలు వస్తున్నాయి… ఆర్థికంగానే కాదు మైనార్టీలో ప్రాచురుత్యం పొందిన వ్యక్తి అలీ అందుకే ఆయనను జగన్ రాజ్యసభకు పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు…