కుమారుడు గెలుపుకోసం చంద్ర‌బాబు నాయుడు ఏం చేశారో తెలుసా ?

కుమారుడు గెలుపుకోసం చంద్ర‌బాబు నాయుడు ఏం చేశారో తెలుసా ?

0
103

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న కుమారుడు మంత్రి నారా లోకేష్ ఈ ఎన్నిక‌ల్లో మొటిసారి ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల్లోకి వ‌చ్చి మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే… అయితే ఈ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు త‌న కుమారుడుని గెలిపించుకునేందుకు అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి మండిప‌డ్డారు.

తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… లోకేష్ గెలుపుకోసం చంద్ర‌బాబు నాయుడు డ‌బ్బును మంచినీళ్లు చ‌ల్లిన‌ట్లు చ‌ల్లార‌ని ఆర్కె మండిప‌డ్డారు. ఏపీలో ఎన్నిక‌లు అర్థ‌రాత్రివ‌ర‌కు జ‌రిగినా మహిళ‌లు భారీ సంఖ్యలో పాల్గొన్నార‌ని అన్నారు. గ‌తంలో ఎన్న‌డు లేని విధంగా ఈ ఎన్నిక‌ల్లో పోలింగ్ శాతం పెరిగింద‌ని అన్నారు. ఇది చంద్ర‌బాబునాయుడు వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌నం అని అన్నారు.

ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌నే ఉద్దేశంతో చంద్ర‌బాబు నాయుడు త‌మ నాయ‌కుల‌పై అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని అయ‌న అరోపించారు. టీడీపీ నాయ‌కులు ఎన్ని కుట్ర‌ల‌కు ప‌డినా వైసీపీ విజ‌యాన్ని ఎవ్వ‌రు అడ్డుకోలేన‌ర‌ని ఆర్కె ధీమా వ్య‌క్తం చేశారు.