అలాంటి వారికి నో ఎంట్రీ- జగన్

అలాంటి వారికి నో ఎంట్రీ- జగన్

0
77

తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో 23 సీట్లు వచ్చాయి.. ఇక వైసీపీకి 151 సీట్లు వచ్చాయి.. పవన్ కు ఒక్క సీటు వచ్చింది.. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది నేతలు వైసీపీలో చేరేందుకు సిద్దం అవుతున్నారు.. మరీ ముఖ్యంగా జగన్ పాలన నచ్చి సంక్షేమ పథకాలు నచ్చి ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు సిద్దం అవుతున్నారు.. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పార్టీ మారాలి అని చూస్తున్నారు.. మరీ ముఖ్యంగా తెలుగుదేశంలో నేతలు చాలా మంది వైసీపీలో చేరాలి అని అనుకుంటున్నా, ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట.

ముఖ్యంగా జగన్ వారికి బ్రేకులు వేయడానికి కారణాలు ఉన్నాయి.. జగన్ పై తీవ్రస్ధాయిలో విమర్శలు చేసిన ఈ నేతలు వైసీపీలోకి మళ్లీ వచ్చి జగన్ పై పాజిటీవ్ కామెంట్లు చేస్తే కచ్చితంగా ప్రజల్లో వీరు రాజకీయాల కోసం పదవుల కోసం వచ్చారు అని అంటారు.. జగన్ కూడా ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటారు… అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శత్రువులు ఉండరు, అందుకే అలాంటి వారిపై జగన్ కీలక నిర్ణయం తీసుకుంటున్నారు.. అలాంటి వారు వస్తాను అంటే పార్టీలోకి ఒఫ్పుకోవడం లేదట.

ఇటీవల ఓ నాయకుడిని మరి చేర్చుకున్నారు కదా అని అంటున్నారు కొందరు…అయితే గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి తెలుగుదేశంలోకి వెళ్లారాయన.. కొన్ని కారణాల వల్ల ఆయన పార్టీని వీడారు.. కాని ఇప్పుడు అలాంటి వారు పార్టీలోకి రావాలి అని అనుకుంటున్నా జగన్ వద్దు అని చెబుతున్నారు.. దీని వల్ల పార్టీలో ఏ నాటి నుంచో ఉన్న నేతలకు ప్రయారిటీ తగ్గుతుంది అని భావన కడా ఉందట.