అల్లు అర్జున్ కు టీడీపీ ధన్యవాదాలు

అల్లు అర్జున్ కు టీడీపీ ధన్యవాదాలు

0
101

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం అలా వైకుంఠపురంలో… ఈ చిత్రం గీతీ ఆర్ట్స్ బ్యానర్పై తెరకెక్కింది… ఈ చిత్రానికి మాటల మాత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు… ప్రేక్షకులకు సంక్రాంతి పండుగకు కానుకగా విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది…

తాజాగా ఈ చిత్రంపై ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు స్పందించారు… శ్రీకాకుళం జిల్లా సంస్కృతి సాహిత్యం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ సిత్తరాల సిరపడు పాట ద్వారా వివరించారంటూ చిత్ర బృందానికి రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపారు…

ముఖ్యంగా ఓ స్టైలిష్ ఫైట్ కోసం తమ ప్రాంతపు పాటను వాడుకున్నందుకు అల్లు అర్జున్ కు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు….