రాజ‌కీయ అరంగేట్రంపై అమ‌లాపాల్ క్లారిటీ

రాజ‌కీయ అరంగేట్రంపై అమ‌లాపాల్ క్లారిటీ

0
114

తెలుగు, త‌మిళ్ చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అమ‌లాపాల్ అనూహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో చిత్ర‌పరిశ్ర‌మ‌కు చెందిన దర్శ‌కుడిని వివాహం చేసుకుంది. ఆ త‌ర్వాత కొన్ని కార‌ణాలు నేప‌థ్యంలో వీరిద్ద‌రూ విడాకులు తీసుకున్నారు. అయితే తాజాగా ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మీడియా ప్ర‌తినిధి త‌న పెళ్లి ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు.

దీంతో ఈ ముద్దుగుమ్మ త‌న పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. తాను గ‌తంలో త‌న నిర్ణ‌యం మేర‌కు వివాహం చేసుకున్నాను క‌నుక‌ అది ఎక్కువ‌కాలం నిల‌వ‌లేద‌ని అన్నారు. అయితే ప్ర‌స్తుతం తాను పెళ్లి చేసుకోవాల‌నే ఉద్దేశం లేద‌ని కేవ‌లం కెరియ‌ర్ పైపు ఎక్కువ దృష్టి పెడుతున్నాన‌ని అమ‌లాపాల్ చెప్పింది. అంతేకాదు ఒక వేళ పెళ్లి చేసుకోవాల‌నే స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు త‌న త‌ల్లిదండ్రులు చెప్పిన వారిని వివాహం చేసుకుంటాన‌ని ఈ ముద్దుగుమ్మ‌చెప్పింది. అంతేకాదు తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశంలేక‌పోలేద‌ని చెప్పింది.