ఈ రోజు కొత్త సంవత్సరం వేడుకలకు తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు దూరంగా ఉన్నారు.. టీడీపీ నేతలకు కూడా పిలుపునిచ్చారు.. రాజధాని రైతులు నిరసన దీక్షలో ఉంటే పండుగ ఎలా చేసుకుంటాము అని టీడీపీ వేడుకలకు దూరంగా ఉంది.
ఏపీలోని ఎర్రబాలెంలో రైతుల దీక్షలో చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి పాల్గొని రైతులకు మద్దతు ప్రకటించారు.. ఈ సమయంలో అమరావతి పరిరక్షణ సమితికి చంద్రబాబు భార్య భువనేశ్వరి తన చేతి గాజును విరాళంగా ఇచ్చారు. ఇక కొత్త సంవత్సరం వేడుకలకు దూరంగా ఉన్న చాలా మంది రాజధాని రైతుల కోసం విరాళాలుగా ఇచ్చారు.
పలువురు రాజధాని పరిరక్షణ సమితికి విరాళాలు అందివ్వడంతో అక్కడ రైతులు సంతోషం వ్యక్తం చేశారు, తమకు ఏపీ అంతా మద్దతు తెలుపుతోందని, ఇది ఏపీ కలల రాజధాని అని అందరూ మీడియా ముఖంగా తెలియచేశారు. కొందరు వృద్ధులు తమ పింఛను డబ్బును విరాళంగా ఇచ్చారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ వాసులు రూ.25 వేలు విరాళంగా అందించారు. మరింత మంది అక్కడ రైతులకు విరాళాలు అందించారు.