రాజధాని అమరావతిపై సినిమా ఎవరు తీస్తున్నారంటే

రాజధాని అమరావతిపై సినిమా ఎవరు తీస్తున్నారంటే

0
88

చందోలు శోభారాణి ఈమె చాలా మందికి తెలిసిన నాయకురాలు.. ఎందుకంటే గతంలో చిరంజీవి స్ధాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఆమె కీలక సభ్యురాలిగా ఉన్నారు.. అంతేకాదు హైకోర్టు న్యాయవాదిగా చందోలు శోభారాణికి మంచి పేరు ఉంది. ప్రజారాజ్యం పార్టీలో ఆమె కీలకంగా పని చేశారు.. అయితే ఆ పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోయిన తర్వాత ఆమె తెలుగుదేశంలో చేరిపోయారు..

తర్వాత రాజకీయాలకు కాస్త దూరంగానే ఉన్నారు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో ఆమె మళ్లీ యాక్టీవ్ అయ్యారు, అమరావతి రైతులకు ఆమె సపోర్ట్ గా నిలిచారు.. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ఆమె విమర్శలు చేస్తున్నారు.

తాజాగా, శోభారాణి ఓ కీలక ప్రకటన చేశారు. టీడీపీ నేత, సినీ నటి దివ్యవాణితో కలిసి అమరావతి నా రాజధాని పేరుతో సినిమా నిర్మించనున్నట్టు తెలిపారు. ఇక్కడ అమరావతి ప్రాంతంలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తామని అన్నారు.. నెల రోజుల్లో ఈ సినిమా తీస్తాము అన్నారు, రాజధాని రైతుల కోసం జగన్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని విమర్శలు ఆరోపణలు చేశారు.