అమెరికా అధ్యక్ష ఎన్నికలు కేవలం ఆదేశానికి సంబంధించిన అంశమే కాదు యావత్ అంతర్జాతీయ సమాజం వాటిని ఆసక్తిగా గమనిస్తుంది… ఆ ఎన్నికలు అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు అనుసరించే విధానాలు అంతర్జాతీయ యవనికపై విశేష ప్రభావాన్ని చూపిస్తాయి…
అందుకే పేద దేశాలతో పాటు పెద్ద దేశాలు, అలాగే అమెరికా మిత్ర దేశాలు, శత్రు దేశాలు కూడా ఈ ఎన్నికలపై ఎప్పుడు ఒక కన్నేసి చూస్తుంటాయి… ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలను పరోక్షంగా ప్రపంచ ఎన్నికలుగా పరిగణించవచ్చు…
ఈ ఏడాదిన నవంబర్ 3న జరగనున్న అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన స్పష్టత వచ్చింది… రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ఏనాడో ఖరారైంది…