అమ్మఒడి పథకం పై ఏపీ ప్రభుత్వం మరో మెలిక

అమ్మఒడి పథకం పై ఏపీ ప్రభుత్వం మరో మెలిక

0
73

ఏపీలో ఈ ఏడాది తొలిలోనే అందరికి అమ్మఒడి అందించే దిశగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.పిల్లలను చదివించే తల్లి ఖాతాలో ఏటా రూ.15 వేలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని ఈ నెల 9న చిత్తూరులో సీఎం జగన్ ప్రారంభిస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.

ఇక ఏపీలో పిల్లల్ని బడికి పంపే తల్లికి అమ్మఒడి పథకం కింద రూ.15 వేలు అందిస్తామని తెలిపారు… 43 లక్షల మంది తల్లుల ఖాతాలో రూ.6,400 కోట్లు జమచేస్తామని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.

అయితే నెలకి కచ్చితంగా కరెంట్ బిల్లు 300 యూనిట్లు లోపు మాత్రమే ఉండాలి ఒకవేళ 300 యూనిట్లు దాటితే వారికి అమ్మఒడి వర్తించదు అని తెలిపారు.ఆరు నెలల విద్యుత్ బిల్లుల సరాసరి పరిశీలించి అర్హులని గుర్తిస్తామని తెలిపింది ప్రభుత్వం.వచ్చే ఏడాది నుంచి 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి వర్తింపజేస్తామని స్పష్టం చేశారు మంత్రి.