అమ్మఒడి పథకానికి కచ్చితంగా ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి

0
95

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాలయాలను మరింత మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్దుతోంది, ఒత్తిడి లేని విద్య అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. ఈ సమయంలో 40 వేల స్కూళ్లకు మహర్ధశ రానుంది, అంతేకాదు వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్న అమ్మఒడి పథకానికి ప్రజల్లో మంచి స్పందన వస్తోంది, తాజాగా దీనిపై పలు నిబంధనలు తీసుకువస్తోంది, ఇప్పుడు కచ్చితంగా అమ్మఒడి పథకం వర్తించాలి అంటే ,ఆ స్కూల్ విద్యార్దికి 75 శాతం హజరు కచ్చితంగా ఉండాలనే నిబంధన తీసుకువచ్చారు. డిసెంబరు నెల వరకూ మొత్తం 75 శాతం హజరు
ఉంటేనే మీ పిల్లలకు అమ్మ ఒడి వర్తిస్తుంది.

మరి దీనికి ఏఏ డాక్యుమెంట్లు కావాలి అనేది చూద్దాం

1.విద్యార్థి తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకునికి ఏడాదికి రూ.15 వేలు అందిస్తారు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తారు
2. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇది వర్తిస్తుంది.
3. కచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండాలి
4. పిల్లలకు తల్లికి లేదా సంరక్షకునికి ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాలి
5. తెల్లరేషన్ కార్డు అప్లై చేసుకున్న వారు కూడా దీనికి అర్హులు అవుతారు
6.ప్రభుత్వ గుర్తింపు ఉన్న స్కూల్ కాలేజీతో చదవాలి
7.విద్యార్థి కనీసం 75% హాజరును కలిగి ఉండాలి.
8. ఇన్ కం ట్యాక్స్ , ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ వచ్చేవారి పిల్లలకు ఇది వర్తించదు

అమ్మఒడి పథకం మీకు కావాలి అంటే ఈ డాక్యుమెంట్లు సిద్దం చేసుకోవాలి, మీకు వైట్ రేషన్ కార్డు లేకపోతే మీరు అప్లై చేసుకున్న సమయంలో మీకు ఇచ్చిన అక్ నాలెడ్జ్ మెంట్ రిసిప్ట్ ఇచ్చినా మీరు అర్హులు అని తెలియచేస్తోంది సర్కారు.