హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. దీనికోసం సూపర్ సేవర్ అనే పేరుతో కొత్త కార్డును అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డుతో రూ.59తో సెలవుల్లో రోజంతా మెట్రోలో తిరగొచ్చని ఆయన చెప్పారు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా ఈ కార్డుతో తిరగొచ్చని స్పష్టం చేశారు. కానీ ఇది కేవలం రెండో శనివారం, ఆదివారం ఇలా ఎంపిక చేసిన 100 రోజుల్లో అని ఎల్ అండ్ టీ ఎండీ కె.వి.బి.రెడ్డి ప్రారంభించారు.