రాష్ట్రంలో ముమ్మరంగా సాగుతోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియకు అధికారులు రేపు సెలవు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా రేపు కొవిడ్ వ్యాక్సినేషన్‌కు విరామం ఇస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి ఎల్లుండి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగనుందని తెలిపారు. దీపావళి వేడుకలు నిర్వహించుకునే సమయంలో శానిటైజర్ ఉపయోగించవద్దని అధికారులు సూచించారు.
ప్రస్తుతం కరోనా నివారణ కోసం శానిటైజర్ లేని ఇల్లు లేదని చెప్పవచ్చు, అయితే దీపావళి పండగ సందర్భంగా దీపాలను, బాణాసంచా వెలిగించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చేతులకు శానిటైజర్లను ఉపయోగించవద్దని సూచించారు. శానిటైజర్లలోని ఆల్కహాల్ కు మండే గుణం ఉంటుంది కనుక దీపావళిరోజున దీపాలు వేగిస్తున్న సమయంలో క్రాకర్స్ కలుస్తున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
మరోవైపు ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగానే సాగుతోంది. ఇప్పటికి 107 కోట్ల డోసులు పంపిణీ చేశారు. అయితే, కొంతమంది లబ్ధిదారులు తమ రెండో డోసు తీసుకోవడం లేదు. 10.34 కోట్ల మంది తమ రెండో డోసును నిర్దేశిత సమయంలో తీసుకోలేదని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.