రైతుని బాధపెట్టడం వల్లే రాజధాని కట్టలేక పోతున్నారంటున్న ఆ టీడీపీ ఎమ్మెల్యే ..

రైతుని బాధపెట్టడం వల్లే రాజధాని కట్టలేక పోతున్నారంటున్న ఆ టీడీపీ ఎమ్మెల్యే ..

0
81

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రస్తావన వచ్చినప్పటి నుండి టీడీపీ నేతలు ఒక్కొకరుగా స్పందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే .. అయితే రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఈ రాజధాని విషయం లో చేసిన వాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గ మారాయి .

అమరావతి పై అసత్య ప్రచారానికి కేటాయించే సమయం వైసీపీ రాష్ట్ర అభివృద్ధికి కేటాయించడం లేదని అయన అన్నారు . ఒకవైపు రైతు ప్రభుత్వం అని చెప్తూనే అమరావతి రైతుల చేత కంట తడి పుట్టిస్తున్నారని అయన వైసీపీ పై విమర్శలు చేసారు . ఇక మిగిలిన మూడు సంవత్సరాల్లో
3 రాజధానులని చెప్పుకుంటూ వైసీపీ కాలం వెళ్లదీస్తుంది అని మీ తీరు గమనిస్తున్న ప్రజలకి తెలుసనీ సత్యప్రసాద్ అన్నారు .

అమరావతి రైతుల గోడు ని ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోవాలని , రైతు;ల విషయం లో ఈ నిర్లక్ష్య వైఖరి పనికిరాదని సత్యప్రసాద్ వైసీపీ తీరుపై సంచలన వాఖ్యలు చేసారు .