జగన్ సమక్షంలో వైసీపీ లో చేరిన ఆనం

జగన్ సమక్షంలో వైసీపీ లో చేరిన ఆనం

0
65

మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఆదివారం వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాఖ జిల్లా వేచలంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆనం కలిశారు. వైఎస్ జగన్ సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఆనంకు వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో ఆనం రాంనారాయణరెడ్డి మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. మరోవైపు భారీ సంఖ్యలో ఆనం మద్దతుదారులు వైఎస్సార్ సీపీలో చేరడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.

ఆనం రాంనారాయణరెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో టీడీపీ సర్కార్ విఫలమైందని విమర్శించారు. బీజేపీతో పాటు టీడీపీ కూడా ప్రజలను దారుణంగా మోసం చేశాయన్నారు. ప్రజలకు అండగా నిలవాలని వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని, ఆయన చేసే ప్రయత్నం విజయవంతం కావాలని ఆనం రాంనారాయణరెడ్డి ఆకాంక్షించారు.