ఆనం గరం గరం వైసీపీకి కొత్త చిక్కులు

ఆనం గరం గరం వైసీపీకి కొత్త చిక్కులు

0
77

నెల్లూరు నయా రాజకీయాలకు అడ్డా అనే చెప్పాలి … ఇక్కడ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం, ఇప్పుడు వైసీపీ ఇలా మూడు పార్టీల్లో కీలక నేతలు ఎదిగారు. తెలుగుదేశం వైసీపీలో సెటిల్ అయ్యారు కొందరు. ఇక వైసీపీ అధికారంలోకి రావడం జిల్లాలో వైసీపీ నేతలు అందరూ గెలవడంతో జగన్ కు అండగా జిల్లా నేతలు నిలిచారు, అయితే మంత్రి పదవుల విషయంలో మాత్రం జిల్లా నుంచి కొందరికి అవకాశం రాలేదు.

తాజాగా పొలిటికల్ స్కూల్ నడిపారు అని పేరు గాంచిన ఆనం ఫ్యామిలీ, రాజకీయాలు ఇప్పుడు వైసీపీలో కొనసాగిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు… మాఫియా కోరల్లో నెల్లూరు నగరం.. అంటూ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ కామెంట్ చేశారు.

అనేక మాఫియాలకు నెల్లూరు నగరం అడ్డాగా మారిందన్నారు. ఒక అడుగు ముందుకు వేయాలి అన్నా అధికారులకు వాళ్ళ ఉద్యోగ భద్రత గుర్తొస్తుంది. నెల్లూరు నగరంలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా సాండ్ మాఫియా, కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు, మీకు ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు నగరం ఉంది. ఈ మాఫియా ఆగడాలకు నెల్లూరు నగరంలో వేలాది కుటుంబాలు, లక్షలాది ప్రజలు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. ఐదేళ్లలో నలుగురు ఎస్పీలు మారిన ఘనత నెల్లూరుకే దక్కింది అని ఆనం అన్నారు. దీంతో అసలు ఆయన ఏ పార్టీ నేతలని అన్నారు.. అలాగే ఏ పార్టీకి సంబంధం లేని నాయకులని అన్నారా.. అనే విషయాలు ఇప్పుడు వైసీపీ టీడీపీ జనసేన నేతల్లో చర్చకు కారణం అవుతున్నాయి.