వైసీపీ కంచుకోటలో భగ్గుమన్న విభేదాలు

వైసీపీ కంచుకోటలో భగ్గుమన్న విభేదాలు

0
89

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లా కంచుకోట తెలుగు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వైసీపీనే మెజార్టీ స్థానాలను గెలుచుకుంది… అలాంటి కంచుకోటలో ప్రస్తుతం వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి… ఆధిపత్యం కోసం వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు రెండు గ్రూపులుగా విడిపోయి పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్నారు…

ప్రధానంగా మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే కాకాణి గోవర్దర్ రెడ్డి ఒక జట్టుగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అలాగే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఒక జట్టుగా తయారు అయ్యారని అంటున్నారు స్థానికి ప్రజలు… ఇటీవలే ఒక లేఅవుట్ నీటి కనెక్షన్ విషయంలో కాకాణి అలాగే శ్రీదర్ రెడ్డిల మధ్య విభేదాలు రచ్చ కెక్కిన సంగతి తెలిసిందే…

అయితే ఇదే క్రమంలో ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు… స్వచ్చమైన తేనె కావాలంటే వెంటగిరికి రండి… ఏ ఇతర మాఫియా కావాలన్నా నెల్లూరు నగరానికి వెళ్లండని అంటూ నెల్లూరు జిల్లాలో ప్రాతినిత్యం వహిస్తున్నా అనిల్ అలాగే శ్రీధర్ రెడ్డిలని ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు… ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి…