అనంతలో చంద్రబాబు బిగ్ స్టెప్

అనంతలో చంద్రబాబు బిగ్ స్టెప్

0
81

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు పార్టీ కంచుకోట అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు… మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండటంతో జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు…

జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల వారిగా సమీక్షలు చేయడంతోపాటు దిశా నిర్దేశం చేయనున్నారు… సమీక్షల్లో జిల్లాలో పార్టీ బలహీన పడటానికి గల కారణాలను గుర్తించనున్నారు చంద్రబాబు.. అలాగే నేతలమధ్య సయోధ్య కుర్చడంతోపాటు క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపనున్నారు…

దానితోపాటు సవాళ్లు కూడా స్వాగతం పలకనున్నాయి… ఇందులో ప్రధానమైనది నేతల మధ్య విభేదాలు… ఎన్నికలు ప్రారంభం అయిన నాటినుంచి నేటికి అదే పందాను కొనసాగిస్తున్నారు తమ్ముళ్లు… వీరికి సయోద్య కుదర్చనున్నారు అధినేత చంద్రబాబు నాయుడు…