అంద‌రూ ఈ ప‌ని చేయండి సీఎం జ‌గ‌న్ కీల‌క పిలుపు

అంద‌రూ ఈ ప‌ని చేయండి సీఎం జ‌గ‌న్ కీల‌క పిలుపు

0
107

ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిత్యం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీనియర్ డాక్ట‌ర్లు పోలీసులు ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష చేస్తున్నారు.. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం దాని తీరు అలాగే ల‌క్ష‌ణాలు ఉన్న‌వారి ఆరోగ్యం ఇలా ప్ర‌తీ విష‌యం తెలుసుకుంటున్నారు.

ఇక కేంద్ర ప్ర‌భుత్వం విధించిన లాక్ డౌన్ కూడా అమ‌లు చేస్తున్నారు, ఈ స‌మ‌యంలో ఏపీలో ఎలాంటి ఆర్ధిక ఇబ్బంది ఉన్నా పేద‌ల‌కు సాయం మాత్రం అందిస్తున్నారు, తాజాగా ప్ర‌ధాని ఇచ్చిన పిలుపుపై సీఎం జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు మ‌రోసారి ఈ విష‌యం తెలిపారు.

సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని చెప్పిన విధంగా అందరూ ఆదివారం రోజు దీపాలు వెలిగించాలని కోరారు. కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలు అందరూ కలిసి దీపాలు వెలిగించాలని కోరారు. ఇక ఈనియ‌మాలు అంద‌రూ పాటించాల‌ని ఈ ప‌ది రోజులు మ‌న‌కు చాలా ముఖ్యం అని తెలిపారు, అంద‌రూ సామాజిక దూరం పాటించాలి అని క‌రోనాని త‌రిమికొట్టాల‌ని రేపు అంద‌రూ దీపాలు వెలిగించండి అని తెలిపారు.