ఎందుకు సీఎం జగన్ దిల్లీ టూర్ రద్దు అయిందంటే

ఎందుకు సీఎం జగన్ దిల్లీ టూర్ రద్దు అయిందంటే

0
101

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు దిల్లీ వెళ్లాల్సి ఉంది, అయితే సడెన్ గా ఈ పర్యటన రద్దు అయింది, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు కారణంగా జగన్ పర్యటన వాయిదా పడిందని తెలుస్తోంది, నిన్ననే ఈ పర్యటన గురించి అంతా వార్తలు బయటకు వచ్చాయి. పలువురు మంత్రులని కూడా కలుస్తారు అనుకున్నారు.

ప్రస్తుతం నిసర్గ తుపాను ముందస్తు కార్యక్రమాల్లో బిజీబిజీగాగా ఉన్నారు కేంద్రమంత్రి అమిత్ షా. అయితే తుపాను తర్వాత మళ్లీ అపాయింట్మెంట్ ఇస్తామని కేంద్ర హోంశాఖ నుంచి ఏపీ సీఎంవోకు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది.

అందుకే నేడు ఈ భేటీ వాయిదా పడింది, అందుకే పర్యటన రద్దు అయింది.మొదట కేంద్ర మంత్రి అమిత్ షాతో.. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులు, కీలక అధికారులతో భేటీ కావాల్సి ఉంది. ఈ భేటీల్లో భాగంగా రాష్ట్రానికి సాయం అందించాల్సిందిగా అభ్యర్థిస్తారని, పెండింగ్ లో ఉన్న పనులు విభజన హామీల గురించి చర్చించనున్నారు అని తెలుస్తోంది.