మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు మంగళగిరి టీడీపీ ఇంచార్జ్ లోకేష్ కు ఇరిగేషన్ మినిష్టర్ అనిల్ కుమార్ యాదవ్ అధిరిపోయే కౌంటర్ ఇచ్చారు… తాజాగా అయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు ఒక అబద్దం చెబితే అయన కుమారుడు లోకేష్ పది అబద్దాలు చెబుతారని అయన ఆరోపించారు…
ప్రధాన ప్రతి పక్ష నాయకులుగా ఉండి వరద భాదితులను పరామర్శించకుండా లోకేష్ కేవలం ట్వీట్లకే పరిమితం అయ్యారని అనిల్ ఎద్దేవా చేశారు… లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆయనకే వదిలేస్తున్నాని అన్నారు…
కాగా లోకేష్ ఇటీవలే ట్విట్టర్ వేదికగా చేసుకుని నోటి పారుదల మంత్రిగారు నోరు తెరిస్తే అబద్దాలు. మొన్న తప్పుడు లెక్కలతో తడబడ్డారు. ఇప్పుడు విషయంపై అవగాహన లేక, నోటికొచ్చిన అబద్దాలు చెప్పి ప్రజల ముందు బొక్కబోర్లా పడ్డారని విమర్శించిన సంగతి తెలిసిందే.. దీని తాజాగా అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు