బీజేపీలో చేరిన అన్నం సతీష్

బీజేపీలో చేరిన అన్నం సతీష్

0
93

ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ పదవికి, ఆపార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన అన్నం సతీష్ ప్రభాకర్ బీజీపీలో చేరారు. శుక్రవారం ఆయన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కమలం తీర్ధం పుచ్చుకున్నారు. అనంతరం ఆయన శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లాలో టీడీడీ సీనియర్ నేతగా కొనసాగుతున్న సతీష్.. బుధవారం తన పదవిని సైతం వదులుకుని, టీడీపీకి రాజీనామా చేసి కలకలం రేపారు. ఆయన రాజీనామా టీడీపీలో తీవ్ర దుమారాన్ని రేపింది. పదవిలో కొనసాగుతుండగానే పలువురు సీనియర్లు సైతం రాజీనామాలు చేస్తుండటంతో పార్టీ నేతలు ఆలోచనలో పడ్డారు.

సతీష్ 2014లో బాపట్ల అసెంబ్లీ స్ధానం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. టీడీపీ సీనియర్‌గా కొనసాగుతున్న సతీష్.. ఆపార్టీకి రాజీనామా చేసి టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేశ్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.