అనంతపురంలో జగన్ కు ఝలక్…

అనంతపురంలో జగన్ కు ఝలక్...

0
86

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది… ఆ పార్టీకి చెందిన కీలక నేతలు టీడీపీలోకి జంప్ చేశారు.. అనంతపురం జిల్లా నగర పాలక ఎన్నికల సందర్భంగా వైసీపీకి చెందిన తాజా మాజీ కార్పోరేటర్ కురబ చిట్రా జానకి టీడీపీ తీర్ధం తీసుకున్నారు… జిల్లాకు చెందిన సిట్టింగ్ కార్పోరేటర్లకు కల్పించిన వైసీపీ నేతల 38వ వార్డుకు చెందిన జానకికి అవకాశం కల్పించలేదు…

దీంతో మనస్థాపానికి గురి అయిన జానకి అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సమక్షంలో టీడీపీ తీర్ధం తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె కార్పోరేటర్ నామినేషన్ వేశారు… పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ జెండా మోసిన తనను గుర్తించలేదని ఆవేదన చెందారు…

బీసీ వర్గానికి చెందిన వారిని వైసీపీ తక్కువ చూపు చూస్తోంది మండిపడ్డారు… రాత్రికి రాత్రే పార్టీ మారిన వారికి టికెట్ కేటాయిస్తున్నారని ఆరోపించారు జానకి… అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆఫర్ వచ్చినప్పటికీ వైఎస్సార్ కుటుంబం అభిమానంతో అర్భన్ ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేశానని తెలిపారు…