ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..వారికీ పది వేల చొప్పున వడ్డీలేని రుణాలు

0
96

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం జగన్ సర్కార్ చిరు వ్యాపారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.

రాష్ట్రంలో 3.97 లక్షల మంది చిరువ్యాపారులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెల 2న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చిస్తూ..’జగనన్న తోడు’ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాలను ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకొని వ్యాపారులను ఆనందపరుస్తున్నారు.

జగనన్న తోడు పథకం ద్వారా రుణం పొంది, సకాలంలో అసలు మొత్తాన్ని చెల్లించిన వారితో పాటు కొత్త వారికి వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, చేతి వృత్తులు వారు ఈ పథకం కింద ప్రయోజనం పొందొచ్చు అని ఈ మేరకు తెలియజేసారు.