ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..వారికీ నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో రాయితీ..

0
107

ఏపీ ప్రభుత్వం రోజు ఏదో ఒక శుభవార్తతో ప్రజలను ఎంతో ఆనందింపచేస్తుంది. ప్రస్తుతం కూడా సీనియర్ సిటిజన్‌లకు ఓక చక్కని శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. కరోనా అదుపులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన వారికి ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీని ఇస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ రూల్ నేటి నుండి అమలులోకి రానుంది. ఈ రాయితీని పొందాలి అంటే సీనియర్ సిటిజన్లు తప్పకుండా ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్ పోర్టు, రేషన్ కార్డు వంటివి చూపించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్లు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు  తెలిపారు.