ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

0
82

దేశంలో ఈ వైర‌స్ క‌ల్లోలంతో లాక్ డౌన్ విధించారు, అయితే ఈ లాక్ డౌన్ వేళ ఎక్క‌డా కూడా ప్ర‌భుత్వాల‌కి ఆదాయం లేదు, దీంతో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కి జీతాలు కూడా చెల్లించ‌లేని స్దితి, ఓ పక్క వైర‌స్ పోరాటానికి వైద్య శాఖ‌కు నిధులు ఇవ్వాలి, మ‌రో ప‌క్క సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయాలి, అలాగే జీతాలు చెల్లించాలి ఈ స‌మ‌యంలో ఏపీ స‌ర్కారు ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది.

కాని తాజాగా మే నెల‌కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇచ్చేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే నెల పూర్తి జీతం ఇవ్వాలని ఫైనాన్స్ , ట్రెజరీకి అందిన ఆదేశాలు జారీ చేశారు. సీఎఫ్ఎంఎస్ ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయనుంది.

దీంతో ఉద్యోగులు చాలా ఆనందంలో ఉన్నారు..అయితే రెండు నెల‌ల బ‌కాయిల‌పై త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకుంటారు ఇప్పుడు శాల‌రీ ఫుల్ అయితే ప‌డ‌నుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతం, ఐఏఎస్‌లకు 40 శాతం, ప్రజా ప్రతినిధులకు అసలు జీతాలే ఇవ్వలేదు గ‌డిచిన కాలంలో. ఇక కేంద్రం స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో రాష్ట్రం అవే పాటిస్తోంది, దీంతో కాస్త ఏపీకి ఆదాయం వ‌స్తోంది అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.