ఏపీకి రాజధాని విశాఖనే తేల్చి చెప్పిన జగన్ సర్కార్…

ఏపీకి రాజధాని విశాఖనే తేల్చి చెప్పిన జగన్ సర్కార్...

0
85

రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… త్వరలోనే విశాఖకు రాజధాని ప్రకటన వస్తుందని అన్నారు.. తాజాగా మీడియాతో మాట్లాడి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు…

న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని విశాఖకు రాజధాని అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు… విశాఖ కేంద్రంగా పరిపాలన సాగడం ఖాయం అని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు… అంతేకాదు చంద్రబాబు నాయుడు అలాగే ఆయన గ్యాంగ్ ఇన్ సైడర్ ట్రెండింగ్ ను త్వరలోనే బయట పెడతామని స్పష్టం చేశారు..

అమరావతిలో చంద్రబాబు ఫండింగ్ ఉద్యమాలు నడుపుతున్నారని ఆయన ఆరోపించారు.. ఇక నుంచి ఉత్తరాంధ్రలో ప్రతీ రోజు ఒక పండుగ వాతావరణం నెలకొంటుదని అన్నారు… విశాఖనే కాకుండా 13 జిల్లాలను సమాంతరంగా అభివృద్ది చేస్తారని విజయసాయిరెడ్డి అన్నారు…