ఏపీలో కరోనా విజృంభన @111 జిల్లా లిస్ట్ ఇదే

ఏపీలో కరోనా విజృంభన @111 జిల్లా లిస్ట్ ఇదే

0
137

ఏపీలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది.. కేవలం నిన్న ఒక్క రోజే డబుల్ కేసులు నమోదు అయ్యాయి, ఏకంగా 20 నుంచి 30 మాత్రమే పాజిటీవ్ కేసులు అనుకుంటే ఏకంగా ఒక్కరోజే భారీగా పాజిటీవ్ కేసులు అని తేలాయి. మొత్తం ఏపీలో 111 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి.

గుంటూరు జిల్లాలో 20 పాజిటివ్ కేసులు నమోదవగా.. ప్రకాశం 15, కడప 15, కృష్ణా 15, పశ్చిమ గోదావరి 14, విశాఖ 11, తూర్పు గోదావరి 9, చిత్తూరు 6, నెల్లూరు 3, అనంతపురం 2, కర్నూలులో ఒక పాజిటివ్ కేసు నమోదయ్యాయి.

ఇక వీరిలో చాలా వరకూ 90 శాతం డిల్లీలోని మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారే.. ఇక ఎవరైనా దిల్లీ వెళ్లి ప్రార్ధనలో పాల్గొన్నవారు ఉంటే కచ్చితంగా ప్రభుత్వానికి తెలపాలని , వారు టెస్ట్ చేయించుకోవాలి అని ప్రభుత్వం తెలిపింది, మీ ఇంటి చుట్టుపక్కల ఎవరు ఉన్నా వారు టెస్ట్ చేయించుకోకపోయిన కచ్చితంగా తెలియచేయండి.