ఏపీలో చాలా ప్రాంతాల్లో కేసులు భారీగా నమోదు అవుతున్నాయి, ఇలా కేసులు వచ్చిన ప్రాంతాలను కట్టడి చేసి కంటైన్మెంట్ జోన్లుగా మారుస్తున్నారు, అయితే చిత్తూరు జిల్లాలో కూడా భారీగా కేసులు నమోదు అవుతున్నాయి, ఈ సమయంలో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కేసులు పెరుగుతున్నాయి.
సోమవారం నుంచి 15 రోజులపాటు తిరుపతి నగరంలో లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు వైరల్ కావడంతో తిరుపతి నగరపాలక సంస్థ స్పందించింది….ఇలా సోషల్ మీడియాలో తిరుమల తిరుపతి లాక్ డౌన్ అని వస్తున్న వార్తల్లో నిజం లేదని కమిషనర్ తెలిపారు.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అని, వాటిని నమ్మొద్దని నగరపాలక కమిషనర్ తెలిపారు. ఇలాంటి వార్తలు వైరల్ చేసే వారిపై చర్యలు తీసుకుంటాం అన్నారు, కచ్చితంగా ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలి అని తెలిపారు.