ఏపీలో ఇళ్లస్ధలం కోసం అప్లై చేసినా రాలేదా ఓసారి ఈ మిస్టేక్స్ చూసుకోండి

ఏపీలో ఇళ్లస్ధలం కోసం అప్లై చేసినా రాలేదా ఓసారి ఈ మిస్టేక్స్ చూసుకోండి

0
101

ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్నారు. వచ్చే ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామని జగన్ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగా సీఎం వైఎస్ జగన్ పేదలకు ఇళ్లపట్టాలు, గృహనిర్మాణంపై సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో పూర్తి వివరాలు కూడా తెప్పించుకుని అన్ని విషయాలు తెలుసుకున్నారు.

లబ్ధిదారుల జాబితాలను తప్పనిసరిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. దీంతో చాలా మంది ఇళ్లకోసం అప్లై చేసుకున్నారు. ఇప్పటికే జనవరి వరకూ దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. మొత్తం 25 లక్షల మంది వరకూ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇంటి స్ధలం కోసం మీరు అప్లై చేసుకున్నా మీకు రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అంటున్నారు అధికారులు. అయితే ఎందుకు రిజక్ట్ అయిందో మీరు వలంటీర్ ని అడిగి తెలుసుకోండి అని చెబుతున్నారు ఉన్నత ఉద్యోగులు.

మీరు ఎవరి పేరు మీద ఇళ్లస్ధలం కావాలి అని కోరుతున్నారో వారు ట్యాక్స్ కడితే వారికి ఇళ్ల పట్టా రాదు. ఇన్ కమ్ ట్యాక్స్ కట్టేవారికి ఇళ్ల స్దలం కూడా ప్రభుత్వం ఇవ్వదు. మీ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉన్నవారికి కూడా ఇళ్ల స్ధలం రాదు. నెలకు 10 వేల కన్నా తక్కువ ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఇళ్లస్ధలం ఇస్తారు. ఇక ఇంటి స్దలం ఎవరు అప్లై చేసుకుంటున్నారో, వారి పేరు మీద ఇళ్లు స్ధలాలు ఉండకూడదు..మరి ఈ నాలుగు కండిషన్ల వల్ల చాలా మంది ఇంటి స్ధలం కోల్పోతున్నారు. కేవలం ఇది మహిళల పేరుమీద మాత్రమే రిజిస్టర్ చేసి ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం.అది చూసుకుని అప్లై చేసుకోవాలి అని అధికారులు చెబుతున్నారు.