దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకూ కొనసాగనుంది .. ఇప్పటికే గ్రీన్ జోన్లు అలాగే వైరస్ ఫ్రీ ఉన్న చోట్ల మినహాయింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. ఏపీలో తాజాగా కొన్ని సడలింపులు ఇచ్చింది సర్కార్. కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్లాంటేషన్ పనులు, కోతలు, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ మినహాయింపు ఇచ్చారు, అలాగే గ్రామాల్లో నిర్మాణ పనులు చేసుకోవచ్చు, కేబుల్ వర్క్ చేసుకోవచ్చు, షరతులతో ఈ కామర్స్ వాహనాలకు పర్మిషన్
ఇచ్చారు, ఇక గ్రామీణ ప్రాంతాల్లో బుక్స్ షాపులు ఫ్యాన్సీ షాపులు తీసుకోవచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లో మాల్స్, మార్కెటింగ్ కాంప్లెక్స్ తెరవడానికి అనుమతి ఇచ్చారు.. కల్లు గీత కార్మికులకు సడలింపులు ఇచ్చారు, ఇక సామాజిక దూరం పాటిస్తూ, అందరూ విధిగా మాస్క్ ధరించాలి అని తెలిపారు, జనాలు గుమిగూడకూడదు అని తెలిపింది సర్కార్, అలాగే వేరే రాష్ట్రాల వారు ఇక్కడ వలస కార్మికులు చిక్కుకుంటే వారిని కూడా సొంత గ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.