ఏపీలో స్కూళ్లు కాలేజీలపై జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఏపీలో స్కూళ్లు కాలేజీలపై జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

0
96

మన దేశంలో కరోనా రోజు రోజుకి తన ప్రతాపం చూపిస్తోంది.. కరోనా పాజిటీవ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 151 కేసులు నమోదు అయ్యాయి, ఈ సమయంలో ఈ కేసులు వైరస్ కట్టడి చేసేందుకు పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికతో వెళుతున్నాయి.

తెలంగాణ లో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా – ఏపీలో ఒక్క కేసు నమోదు అయ్యింది. అయితే రోజురోజుకి కరోనా బాధితులు ఊహించని విధంగా పెరిగిపోతున్నారు. దీనితో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అన్నీ కాలేజీలు స్కూళ్లు క్లోజ్ చేయాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది, ఇప్పటికే తెలంగాణలో మార్చి 31 వరకూ వాటిని క్లోజ్ చేశారు.

తాజాగా ఏపీలో కూడా ఈ నిర్ణయం అమలు చేస్తున్నారు,యూనివర్సిటీలు – కళాశాలలు – పాఠశాలలు – కోచింగ్ సెంటర్లతో సహా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా వీటిని పాటించకపోతే వారిపై కేసులు నమోదు చేస్తాం అని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు అధికారులు. అంతేకాదు పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడి ఉండకూడదు అని చెబుతున్నారు.