ఏపీ ప్రజలకు జగన్ సంక్రాంతి కానుక అదిరింది….

ఏపీ ప్రజలకు జగన్ సంక్రాంతి కానుక అదిరింది....

0
90

మరో రెండు వారాల్లో సంక్రాంతి పండుగ రాబోతుంది… అయితే ఈ పండుగకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు… రైతులకు సంక్రాంతి పండుగ కానుకగా అర్హులు అయిన ప్రతీ రైతు ఖాతాలో 2000వేల రూపాయలు జమ చేస్తామని సర్కార్ తెలిపింది…

ఈ రెండు వేల రూపాయలను రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.. సుమారు 4650629 మంది ఖాతాలకు రైతు భరోసా తుది విడత మొత్తం దాదాపు1,082 కోట్లను నేరుగా బదిలీ చేయనున్నారు.. గతంలో ఇచ్చిన మాట ప్రకారం పీఎం కిసాన్ కింద సర్కార్ ప్రతీ రైతు ఖాతాలో 11500 రూపాయలను జమ చేసిన సంగతి తెలిసిందే…

దానితో పాటు మరో రెండు వేలను జమచేయనున్నారు… ఇప్పటివరకు ఆర్థిక సహాయం అందుకున్న లబ్దిదరుల పేర్లను శక్రవారం నుంచి సచివాలయంలో ప్రదర్శిస్తారు…