ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..ఆ శాఖలో భారీగా బదిలీలు

AP Sarkar is a key decision .. Massive transfers in that department

0
105

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖలో సుమారు 10 వేల మందిని బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఒకే చోట పని చేస్తూ… ఐదేళ్లు దాటిన వారు తప్పనిసరిగా బదిలీ చేయాలన్న నిబంధన బైబిల్ తో పాటు నర్సులు, పారామెడికల్ సిబ్బంది అలాగే నాలుగో తరగతి ఉద్యోగులను బదిలీ చేయనుంది.

బోధన్ ఆస్పత్రుల్లో కొందరు వైద్యులు గత 25 సంవత్సరాలుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతులు వచ్చిన నిరాకరిస్తూ అక్కడే పని చేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం వీరందరూ బదిలీ కానున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం 39 వేల మంది ఉద్యోగులను ఏకంగా 25 శాతం మంది బదిలీ కానున్నారు. బదిలీకి అర్హత కలిగిన వారి నుంచి 20 ప్రదేశాలను కోరుకునేలా ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

కొన్నిచోట్ల ముఖ్యంగా బోధనాసుపత్రుల్లో సీనియర్‌ నిపుణులైన వైద్యులు ఉన్నారు. వీరిలో కొందరు రెండు, మూడు సంవత్సరాల్లో ఉద్యోగ విరమణ చేసే వారున్నారు. ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ పరంగా కొందరు విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి చోట్ల స్థిరపడ్డారు. బదిలీ ప్రక్రియ అనంతరం వీరు విధుల్లో కొనసాగుతారా? వైదొలుగుతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బదిలీలు తక్కువగా జరిగేలా ‘కటాఫ్‌’ పెట్టేలా నిబంధనలను సవరించడానికి ప్రయత్నాలూ జరుగుతున్నాయి.