Breaking: నైట్ క‌ర్ఫ్యూపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

0
81

ఏపీ సర్కార్ కీలక నిర్ణ‌యం తీసుకుంది. కరోనా విజృంభణ తగ్గిన నేపథ్యంలో నైట్ క‌ర్ఫ్యూను ఎత్తివేయ‌నున్న‌ట్టు సీఎం జగన్ ప్ర‌కటించారు. గ‌త కొద్ది రోజుల నుంచి ఏపీలో 1000 కేసులదిగువనే  వ‌స్తున్నాయి. ఈ రోజు 500 క‌న్నా.. త‌క్కువగా 434 కేసులు మాత్ర‌మే వెలుగు చూశాయి. దీంతో నైట్ క‌ర్ఫ్యూ ఎత్తి వేయాల‌ని ముఖ్యమంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ప్ర‌జ‌లు అంద‌రూ కూడా మాస్క్ ల‌ను తప్ప‌ని స‌రిగా ధ‌రించాల‌ని సూచించారు. అలాగే భౌతిక దూరం కూడా పాటించాల‌ని అన్నారు.