దేశంలో లాక్ డౌన్ అమలు అవుతోంది, దీంతో పూర్తిగా ప్రజా రవాణా ఆగిపోయింది, ఈ సమయంలో బస్సులు రైళ్లు విమానాలు అన్నీ ఆగిపోయాయి, అయితే బస్సు సర్వీసులు మే 18 నుంచి ప్రారంభించేందుకు ఏపీలో అధికారులు రంగం సిద్దం చేశారు, ఇటు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ఇ వ్వగానే ఇటు బస్సులు నడపనున్నారట.
ఇక పై ప్రగతి రధచక్రాలు రోడ్డెక్కనున్నాయి అని తెలుస్తోంది, దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి…ప్రజారవాణా సర్వీసులు సిద్దం చేశారు అధికారులు.. ఇక ప్రతీ డిపోకి 10 నుంచి 12 బస్సులు నడవనున్నాయి,, గ్రీన్ ఆరెంజ్ జోన్ మ్యాపింగ్ రూట్ మ్యాపింగ్ అన్నీ జరుగుతున్నాయి.ఇక సిట్టింగ్ విషయంలో కూడా పూర్తిగా మార్పులు చేశారు అధికారులు.
సూపర్ లగ్జరీ(36 సీట్లు): 24 సీట్లకు కుదింపు
అల్ట్రా డీలక్స్(40 సీట్లు): 27 సీట్లకు కుదింపు
ఎక్స్‌ప్రెస్(50 సీట్లు): 30 సీట్లకు కుదింపు
పల్లెవెలుగు(60 సీట్లు): 36 సీట్లకు కుదింపు
సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్(45 సీట్లు): 23 సీట్లకు కుదింపు
సిటీ ఆర్డినరీ(46 సీట్లు): 24 సీట్లకు కుదింపు
ఇక కచ్చితంగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ బస్సు ప్రయాణాలు చేయాలి.