స్కూల్ విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్

స్కూల్ విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్

0
39

కేంద్రం ఈ లాక్ డౌన్ వేళ దాదాపు 20 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించింది, వీటి ద్వారా అన్నీ రంగాల‌ను ఆదుకుంటాం అని తెలిపింది, నేరుగా ప్ర‌తీ ఒక్క‌రికి ల‌బ్ది చేకూరుతుంది అని తెలిపారు. అయితే కోవిడ్ వ‌ల్ల స్కూల్లు కూడా తెర‌చుకోవ‌డం లేదు, ఇక దాదాపు మ‌రో రెండు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది అని అంద‌రూ భావిస్తున్నారు.

అందుకే విద్యార్థుల చదువులు దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది పడవద్దు అన్న ఉద్దేశంతో స్వయంప్రభ డీటీహెచ్ ఛానళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక టెక్నాల‌జీతో విద్యార్దుల‌కి విద్య‌ను అందిస్తామ‌ని తెలిపారు.

అంతేకాదు ఇంటర్నెట్ యాక్సెస్ లేని వారికి కూడా ఆ ఛానళ్ల ద్వారా సేవలు అందించినట్లు చెప్పారు. ఇక దేశంలో ఇప్ప‌టికే స్వయం ప్రభ కింద మొత్తం 3 ఛాన‌ల్స్ కేటాయించారు, ఇక కొత్త‌గా మ‌రో 12 ఛాన‌ల్స్ తీసుకువ‌స్తారు…. అలాగే ఈ-పాఠశాల వెబ్‌సైట్‌లో సుమారు 200 కొత్త పుస్తకాలను జోడించినట్లు మంత్రి సీతారామన్ తెలియ‌చేశారు.