కేంద్రం లాక్ డౌన్ జూన్ 30 వరకూ విధించింది, ఈ సమయంలో కేసుల సంఖ్య కూడా మరింత పెరుగుతోంది, ఈ సమయంలో కేంద్రం సడలింపులు కూడా ఇస్తోంది, తాజాగా కేంద్రం పలు సడలింపులు ఇచ్చింది, ఇటు ఏపీ ప్రభుత్వం కూడా మరిన్ని సడలింపులు ఇస్తోంది.
జూన్ 8 నుంచి రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చింది. కోవిడ్ 19 నియమ నిబంధనలను అనుగుణంగా పలు సూచనలతో హోటళ్లు, రెస్టారెంట్లు తీయాలి, కచ్చితంగా పనిచేసే వారు మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, చాలా వరకూ రెస్టారెంట్లు హూటల్స్ పార్శిల్స్ ఇస్తేనే మంచిది.
సిట్టింగ్ కు ఇంకా కొన్ని రోజులు దూరంగా ఉంటే మంచిది అని చెబుతున్నారు అధికారులు, ఇక రెండు నెలల లాక్ డౌన్ కాలంలో చాలా ఇబ్బందులు పడ్డామని అంటున్నారు హోటల్ వ్యాపారులు. ఇక జూన్ 8 నుంచి దేవాలయాలు కూడా తెరచుకోనున్నాయి, ఇప్పటికే తగు జాగ్రత్తలతో దేవాలయాల్లో భక్తులకి పలు ఏర్పాట్లు చేస్తున్నారు.