కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న అలర్లు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. అయితే అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకోవాలంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో అని దేశమంతా ఎదురుచూస్తుంది.
మరోవైపు బీహార్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, హర్యానా లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కాగా అగ్నిపధ్ పథకానికి వ్యతిరేకంగా చాలా పార్టీలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది.
ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పై మావోయిస్టు పార్టీ స్పందించింది. నాజీల పాలన తలపించేలా కేంద్రం పాలన ఉందని మావోయిస్టు పార్టీ ఆగ్రహించింది. అగ్నిపధ్ ను వెంటనే ఆపాలని, దీనిపై పోరాటం చేస్తున్న వారికి తమ మద్దతు ఉంటుందని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.