ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కు మరో కీలక పదవి ఇచ్చిన మోదీ

ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కు మరో కీలక పదవి ఇచ్చిన మోదీ

0
81

మన భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నేడు పదవీ విరమణ చేయనున్నారు.ఆర్మీ చీఫ్ గా గత మూడేళ్లుగా సేవలందించారు ఆయన, ఇక జనరల్ బిపిన్ రావత్ కు నేడు ఘనంగా పదవీ విరమణ కార్యక్రమం చేయనుంది ఆర్మీ. ఓ గొప్ప ఆఫీసర్ గా ఆయన మంచి పేరు సంపాదించారు.

ఇక ఆయన స్ధానంలో భారత సైన్యానికి కొత్త అధిపతిగా లెఫ్టెనెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే పదవీ విరమణ రోజే , ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కు అతి పెద్ద బాధ్యత అప్పగించారు.. అవును భారత త్రివిధ దళాలను ఒకే ఛత్రం కింద సమన్వయం చేసే దిశగా కేంద్రం కీలక చర్య తీసుకుంది. ఈ ఏడాది మొదట్లో దీనిపై ఆలోచన చేసింది కేంద్రం. దీనిపై తాజాగా నిర్ణయం తీసుకుంది.

ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా నియమించింది. సీడీఎస్ పదవిని అలంకరించిన తొలి వ్యక్తిగా బిపిన్ రావత్ చరిత్రలో నిలిపోనున్నారు. ఇక పదవీ విమరణ చేసిన తర్వాత ఈ కొత్త పదవి బాధ్యత తీసుకోనున్నారు. . సీడీఎస్ పదవిలోని వ్యక్తి గరిష్ఠ వయోపరిమితిని కేంద్రం 65 ఏళ్లుగా నిర్ధారించింది.