రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదించారు. సభ్యుల ప్రతిఘటనల మధ్య బిల్లును అమిత్ షా ప్రతిపాదించారు. కశ్మీర్‌కు సంబంధించిన ప్రతి అంశంపై సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అమిత్ షా తేల్చిచెప్పారు. అయితే అమిత్ షా బిల్లును ప్రతిపాదిస్తున్న సమయంలో విపక్షాలు అడ్డుతగిలాయి. ఈ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం విపక్షాలు చైర్మన్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు.
బ్రేకింగ్ : ఆర్టికల్ 370 రద్దుకు అమిత్ షా ప్రతిపాదన
బ్రేకింగ్ : ఆర్టికల్ 370 రద్దుకు అమిత్ షా ప్రతిపాదన