యూఏపీఏ బిల్లు ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తోంది: ఎంపీ అసదుద్దీన్

యూఏపీఏ బిల్లు ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తోంది: ఎంపీ అసదుద్దీన్

0
41

ముస్లింలు, దళితులపైనే క్రూరమైన చట్టాలను ఉపయోగిస్తున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్రంపై ఫైర్ అయ్యారు. చట్టవిరుద్ద కార్యక్రమాలకు పాల్పడేవారిపై కఠిన శిక్షను అమలు చేయాలంటూ ప్రవేశపెట్టిన బిల్లు (యూఏపీఏ)పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ..యూఏపీఏ బిల్లు ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తుందన్నారు. యూఏపీఏ బిల్లు న్యాయపరమైన హక్కుల్నినాశనం చేస్తోందని చెప్పారు. అంతర్జాతీయ ఒప్పందాల కోసం జాతీయవాదాన్ని అమ్మేస్తున్నారా అని కేంద్రాన్ని ఒవైసీ ప్రశ్నించారు. మరోవైపు గతంలో ఇలాంటి కఠినమైన చట్టాలను చేసిన కాంగ్రెస్ పార్టీని కూడా అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు. ఈ చట్టాల ద్వారా ఒక్క కాంగ్రెస్ నేతనైనా అరెస్టు చేయాలని..అలా అయితే వాళ్లకు ఆ చట్టం తెలుస్తుందని ఓవైసీ అన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడిన సమయంలో బీజేపీ సభ్యులు ఓవైసీకి మద్దతు పలికడం గమనార్హం.