అసెంబ్లీ వేదికగా టీడీపీ నేతల చిట్టా విప్పిన ఆర్దిక మంత్రి

అసెంబ్లీ వేదికగా టీడీపీ నేతల చిట్టా విప్పిన ఆర్దిక మంత్రి

0
81

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారు అని తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు వైసీపీ అధినేత ఆనాటి ప్రతిపక్ష నేత జగన్.. కాని నేడుపరిస్దితి మారింది. రాజధాని కేవలం కొంతమందికి లాభం చేకూరేలా ఏర్పాటు చేశారు అని జగన్ విమర్శించారు.. నేడు సీఎం అయ్యారు జగన్.. దీంతో రాజధాని విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు.

తాజాగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఎవరు ఎవరు ఎన్ని ఎకరాలు కొన్నారు అనే విషయం పై మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు మరి ఆ వివరాలు చూస్తే

01.06.2014 నుంచి 01.12.2014 వరకు భూములు కొనుగోలు చేసిన టీడీపీ నాయకులు వివరాలు ..

కంతేరులో హెరిటేజ్ కంపెనీ కోసం 14.22 ఎకరాలు (ఆ భూముల సర్వే నెంబర్లు 27,56, 62,63 )
మాజీ మంత్రి నారాయణ- తన బంధువులు ఆవుల మునిశంకరరావు, రావూరు సాంబశివరావు, ప్రమీల పేర్లపై 55.27 ఎకరాలు కొన్నారు.
ప్రత్తిపాటి పుల్లారావు – గుమ్మడి సురేశ్ పేరుపై 55.27 ఎకరాలు
రావెల కిశోర్ బాబు మైత్రి ఇన్ ఫ్రా పేరిట 40.85 ఎకరాలు
కొమ్మాలపాటి శ్రీధర్ – అభినందన్ ఇన్ ఫ్రా సంస్థ పేరుపై 68.60 ఎకరాలు
పయ్యావుల కేశవ్ .. పయ్యావుల శ్రీనివాస్, వేం నరేందర్ రెడ్డి పేర్లపై 15.30 ఎకరాలు

పల్లె రఘునాథరెడ్డి తన కొడుకు పల్లె వెంకట కిశోర్ కుమార్ రెడ్డి పేరుపై 7.56 ఎకరాలు
వేమూరు రవికుమార్ ప్రసాద్- 25.68 ఎకరాలు
లింగమనేని రమేశ్ సుజన, ప్రశాంతి పేర్లపై 351 ఎకరాలు
యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్ యాదవ్ పేరుపై 7 ఎకరాలు

కోడెల శివప్రసాద రావు- శశి ఇన్ ఫ్రా పేరుపై 17.13 ఎకరాలు
ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి- ధూళిపాళ్ల వైష్ణవి, పుల్లయ్య పేర్లపై 13.50 ఎకరాలు

పరిశ్రమల ఏర్పాటు పేరుతో..
వీడీసీ ఫర్టిలైజర్స్ పై.లి. ఎంఎస్ పీ రామారావు, బాలకృష్ణ వియ్యంకుడి బావమరిదికి జగ్గయ్య పేటలో- 499 ఎకరాలు
కోడెల శివప్రసాదరావు – 17.13 ఎకరాలు
లింగమనేని రమేశ్ -1.76 2.34 ఎకరాలు
యలమంచిలి శివలింగప్రసాద్ – 4 ఎకరాలు కొనుగోలు చేశారని, వీరే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నట్టు తెలిపారు.
మొత్తానికి అసెంబ్లీ వేదికగా వీరి పేర్లు చెప్పడంతో అందరూ ఇంత ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందా అని చర్చించుకుంటున్నారు.