ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడి హేయం..బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

Attack on MP Dharmapuri Arvind is heinous..Bandi Sanjay Ghat comments

0
76

తెలంగాణ: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై జరిగిన దాడిని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. పోలీసుల కనుసన్నల్లో టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం హేయమైన చర్య. డీజీపీ మహేందర్ రెడ్డి ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎందుకు ప్రభుత్వం ఫోన్ ఇచ్చిందో అర్ధం కావడం లేదు.

పార్లమెంట్ సభ్యుడి పై దాడి జరిగింది అంటే.. రాష్ట్రలో పరిస్థితి అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి గాడి తప్పింది. ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. ఎంపీపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు.

ఖమ్మం జిల్లాలో యువకుడి ఆత్మహత్య బాధాకరం. ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటారో ఈ ముఖ్యమంత్రి…. 317 జీవోతో ఉద్యోగులు ఆందోళనలతో, భాదతో చనిపోతున్నారు. ఫామ్ హౌస్ నుండి 7 సంవత్సరాలుగా బయటకు రాని ముఖ్యమంత్రి. వెంటనే 317 జీవోని సవరించకపోతే త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతాం. కేంద్రం దృష్టికి తీసుకుపోతాం తెలంగాణ రాష్టంలో జిల్లా జిల్లాకు ఒక రూల్ తెస్తున్నాడు సీఎం.

ప్రజల్లో వ్యతిరేకత రావడంతో సీఎంకి దిక్కుతోచడం లేదు మొదటి తెలంగాణ ద్రోహి కెసిఆర్… కనీసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఓటింగ్ లో కూడా పాల్గొనలేదు కెసిఆర్ ముఖ్యమంత్రి స్కామ్ లపై ద్రుష్టి పెట్టింది కేంద్రం.. జైలు జీవితం కెసిఆర్ కి తప్పదు కొత్త డ్రామాతో ముందుకు పోతుండు కెసిఆర్.. కేంద్రం నీకు ఏమిచ్చింది అనేది కాదు తెలంగాణకి నీవు ఏమి చేశావ్ అన్నది చెప్పు కేంద్రం నిధులను దారి మళ్లించావ్.. కేంద్రం ఇచ్చిన నిధుల లిస్ట్ బయటకు తియ్ దమ్ముంటే..ప్రధానిని సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు కలిశారు. మరి అప్పుడేందుకు తెలంగాణకి జరిగిన అన్యాయం గుర్తుకు రాలేదు?

లేఖల పేరుతో కేంద్రంపై బురదజల్లడం తప్ప మరేమి లేదు. ఉప ఎన్నికలు జరిగిన నాగార్జున సాగర్, హుజూర్ నగర్ ల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికి అమలుకాలేదు. టెస్లా కార్ ల షోరూమ్ ను హైదరాబాద్ లో పెట్టాలని కేటీఆర్ ఆ కంపెనీ సీఈఓకు ట్విట్ చేశాడు. కానీ షోరూమ్ కాదు కార్ల తయారీ కంపెనీ పెట్టాలని మేము కోరుతున్నాం. మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ పెడితే వేల ఉద్యోగాలు వస్తాయి. షోరూం, గోదాం పెడితే వాచ్ మెన్ తప్ప వేరే ఉద్యోగాలు రావు. ఈ మంత్రికి కనీసం ఆ అవగాహన కూడా లేదు. ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుంట లేదని తప్పుడు ప్రచారం ట్వట్టర్ మంత్రి మానుకోవాలని చురకలు అంటించారు బండి సంజయ్.