తెలంగాణలో కరోనా ఉగ్రరూపం..పెరిగిన పాజిటివ్ కేసులు..జిల్లాల వారిగా కేసుల వివరాలివే..

Corona rage in Telangana..Increased positive cases..District wise details of cases ..

0
36

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 1,13,670 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా..4559 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఒక్క జీహెచ్ఎంసీలోనే 1,450 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే నేడు మరో ఇద్దరు క‌రోనా కాటుకు బలయ్యారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా కాటుకు మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,077 కి చేరింది. అలాగే నేడు క‌రోనా వైర‌స్ నుంచి 1961 మంది కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో 36,269 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గత 24 గంటల్లో జిల్లాల వారిగా కరోనా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

ఆదిలాబాద్ 52
కొత్తగూడెం 93
జిహెచ్ఎంసి 1439
జగిత్యాల 66
జనగామ 46
జయశంకర్ భూపాలపల్లి 37
జోగులాంబ గద్వాల 35
కామారెడ్డి 47
కరీంనగర్ 112
ఖమ్మం 145
కొమరం భీం ఆసిఫాబాద్ 21
మహబూబ్ నగర్ 98
మహబూబాబాద్ 71
మంచిర్యాల 99
మెదక్ 59
మేడ్చల్ మల్కాజ్ గిరి 432
ములుగు 31
నాగర్ కర్నూల్ 76
నల్లగొండ 138
నారాయణపేట 20
నిర్మల్ 74
నిజామాబాద్ 98
పెద్లపల్లి 96
రాజన్న సిరిసిల్ల 93
రంగారెడ్డి 322
సంగారెడ్డి 88
సిద్దిపేట 87
సూర్యాపేట 78
వికారాబాద్ 89
వనపర్తి 67
వరంగల్ రూరల్ 54
వరంగల్ అర్బన్ 201
యాదాద్రి భువనగిరి 84