ఇవాళ ఆర్మూరు టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యా ప్రయత్నం జరిగిన ఘటన మరవకముందే టీఆర్ఎస్ పార్టీలో మరో ఘటన చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీతేజ పై దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీతేజ కారును గుర్తు తెలియని కొంతమంది దుండగులు అడ్డుకొని ఎక్కారు.
ఆ తరువాత పృథ్వీతేజను దుండగులు కత్తితో బెదిరించి రూ. 75 వేలు లాక్కునున్నారు. ఈ ఘటన రెండు రోజుల కిందట జరిగినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.