ఫ్లాష్- సీఎం ఇంటిపై దాడి..బీజేపీ పనే అంటున్న ఆప్

0
79

ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటిపై దాడి ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దాడిలో గుర్తు తెలియని వ్యక్తులు సీసీ కెమెరాలను, బారికేడ్లను ధ్వంసం చేశారు. అంతేకాదు కేజ్రీవాల్ ఇంటి ముందు గేటుపై కాషాయ రంగు చల్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఫోటోలను షేర్ చేసిన ఆప్ ఈ పని బీజేపీ నాయకులదే అని ఆరోపించారు. కాశ్మీర్ ఫైల్స్ పై ప్రశ్నించినందుకు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.